Post date: Aug 17, 2011 3:27:53 PM
ముఖ్యమంత్రి రోశయ్యకు ఎసిబి క్లీన్ చిట్ ఇవ్వడంపై వైఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు.అమీర్ పేట భూముల కేసులలో రోశయ్యకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ,సోనియాగాంధీకి భజన చేసేవారికి ఎవరికైనా క్లీన్ చిట్ ఇస్తారని ధ్వజమెత్తారు.రోశయ్యపై ఈ భూమి బదలాయింపుపై ఆరోపణలు వచ్చాయని, కాని ఎసిబి రోశయ్యకు క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. కాగా వై.ఎస్. హెలికాఫ్టర్ ప్రమాదం కేసులో ఇద్దరు అధికారులను బలి చేసి కేసును తప్పుదారి పట్టించడానికి మంత్రివర్గం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.