Post date: Aug 22, 2011 1:30:19 PM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై జీవీఎం సీ కార్పొరేటర్లు కూడా గరంగరంగా ఉన్నారు. తమ పదవులకు రాజీనామా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జీవీఎంసీలో వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులైన కార్పొరేటర్లు 11 మంది తమ నిర్ణయాన్ని ఆదివారం రాత్రే ప్రకటించగా మరో ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లు సైతం సిద్ధమైనట్టు తెలిసింది. రాజధానిలోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక భేటీకి హాజరైన కొంద రు సభ్యులు రావాల్సి ఉంది. వీరంతా వచ్చాక జిల్లాకు చెందిన ప్రధాన నేతలతో చర్చించి మూకుమ్మడిగా ఒకేరోజు తమ రాజీనామాలను ప్రకటించనున్నారు.