Post date: Mar 13, 2012 6:18:17 AM
వివిధ జిల్లాల్లోని బీసీ, మైనారిటీ విభాగాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లను నియమించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు వారిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర కన్వీనర్లు గట్టు రామచంద్రరావు, హెచ్.ఎ.రెహ్మాన్‌లు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించారు.
బీసీ సెల్ కన్వీనర్లుగా..
వైఎస్ఆర్ కడప జిల్లా- అవ్వూరు జానకిరామయ్య,
తూర్పుగోదావరి- జి.రమణ,
ప్రకాశం- కటారి శంకర్,
హైదరాబాద్ సిటీ- ఎస్.శ్రీనివాస్,
మహబూబ్‌నగర్- టి.వేణుగోపాల్,
ఖమ్మం- తోట రామారావులను
నియమించినట్లు గట్టు తెలిపారు.
మైనారిటీ సెల్ కన్వీనర్లుగా...
చిత్తూరు- సయ్యద్ అహ్మద్ క్వార్ది,
కరీంనగర్- మహ్మద్ అస్లాం,
కరీంనగర్ సిటీ- మహ్మద్ జావేద్,
విజయవాడ సిటీ- మహ్మద్ అబ్దుల్ అమీర్ జాని,
గుంటూరు- సయ్యద్ మహబూబ్‌లను నియమించినట్లు రెహ్మాన్ చెప్పారు.