Post date: Apr 16, 2011 10:7:11 AM
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ సతీమణి విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి, సోదరి షర్మిల తదితరులు ఆయన సమాధిపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి నేడు విజయమ్మ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను వైయస్సార్ సమాధిపై ఉంచారు. అనంతరం నామినేషన్ వేసేందుకు బయలుదేరారు