Post date: Feb 01, 2011 10:28:18 AM
ప్రభుత్వ పధకాలు చూడ పరమ రంజుగానుండు
ప్రజల వద్దకు చేరేసరికి పలచనౌచుండు
ఉల్లిని తలచిన తల్లిని కంటతడి పెడుతోందిరా
జనుల కాపాడేదేవరు జగదాభిరామ....
ముఖ్యమంత్రి పదవి మున్నాళ్ళ ముచ్చట
పైకి నవ్వుతూ వెనుక నుంచి గిచ్చుట
పదవి కాదది పునిష్మెంటురా
జనుల కాపాడేదేవడురా జగదాభిరామ ...
పదవి ఉండగానే పోగుచేసుకోవాలి
ప్రాజెక్టు కట్టేది మంత్రి బావమరిది
కూలిన కూలివానిపైకి నెడతావు
జనులను కాపాడేదేవరు జగదాభిరామ ...
మేగాసామ్రాజ్యాన్ని వదిలి ప్రజరాజ్యానికి వచ్చావు
టికెట్లు హౌసు ఫుల్లు అసెంబ్లీలో సీట్లు ఆల్మోస్టు నిల్లు
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో ఏదో అని
సోనియా గాంధీకి మొక్కు...మన్మోహన్ కూ ఆమె దిక్కు ....
----- Phanimadav Kasturi