Post date: Apr 14, 2011 7:35:20 PM
నన్ను కట్టడి చేయూలని చిత్రహింసలు
కడప జిల్లాలో 3 వేల మందిపై బైండోవర్ కేసులు పెట్టారు
మీరంతా ఉండగా నేను ఒంటరివాడిని కాదని గర్వంగా చెబుతున్నా
సంక్షేమ పథకాల అమలుకు ప్రతిపక్షం పోరాడుతుందని ఎదురుచూశా
రోడ్‌షోల్లో యుువనేత వైఎస్ జగన్
ఓ వైపు దివంగత నేతను నోటికొచ్చినట్లుగా తిడుతూనే వురో వైపు ఆయున పేరును జపిస్తూ ఫొటోలకు దండలు వేస్తూ తవు అవసరాలకు వాడుకుంటున్నారని.. ఇది మోసపూరిత, నీచ రాజకీయానికి పరాకాష్ట అని యువనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డిధ్వజమెత్తారు. అసెంబ్లీలో పాలకపక్షం ప్రతిపక్షం పదిరోజులపాటు డ్రావూలు ఆడి, హౌస్ కమిటీ వేసి వుహానేతపై బురద జల్లుతూ, ఆయునను అప్రదిష్ట పాలు చేసేందుకు యుత్నిస్తూనే వురోవైపు ఆయున పేరును, బొవ్మును వాడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే తనకు ఎంతో బాధ వేస్తోందన్నారు. పాలకపక్షం సంక్షేమ పథకాల అమలును నీరు గార్చుతోందన్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవటానికి వరంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పరిధిని ప్రభుత్వం కుదించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం దివంగత మహానేత విధానాలకు పూర్తి విరుద్ధంగా ఉందని విస్మయం చెందారు.
సంక్షేమ పథకాల అమలు కోసం ప్రధాన ప్రతిపక్షం సర్కారుపై పోరాటం చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూశా, కానీ ప్రతిపక్షం పాలకపక్షం కుమ్మక్కై సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారని దుయ్యట్టారు.‘మహా నేత మరణం తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన ఆత్మ బంధువుల కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువలో మాట ఇచ్చాను. ఆ నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆత్మ బంధువుల ఇంటికి వెళ్లాను కాబట్టే ఈ వేళ ఉప ఎన్నికలు వచ్చాయి’ అని అన్నారు. ఆత్మాభిమానం చంపుకొని, ఆత్మ బంధువులను వదులుకుని ఉంటే సోనియా గాంధీ కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకునేదేమోనని అన్నారు. ఇవేమీ చేయలేదు కాబట్టే ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చిందని చెప్పారు. ఆయన బుధవారం జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం, ముద్దనూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగించారు.
మహా నేత మరణించిన నాటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తనను చిత్ర హింసలకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలిన నెల రోజులకే తనకు ఇన్‌కంట్యాక్స్ నోటీసులు పంపించారని గుర్తుచేశారు. దివంగత నేత పాదాల చెంత వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పుట్టిన నాటి నుంచి తనను కట్టడి చేయడానికి చేయని ప్రయత్నమంటూ లేదని అన్నారు. కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న దాదాపు 3 వేల మందిపై పోలీసులు బైండోవర్ కేసులు పెట్టారు. పార్టీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారన్నారు. తనను ఓడించడానికి మండలానికో మంత్రి దిగారని, ఈ 10 మంది మంత్రులను పర్యవేక్షించడానికి మరో నలుగరు పెద్దలు తిరుగుతున్నారని, ఈ నలుగురు ఢిల్లీ అధిష్టానం ఎప్పటికప్పుడు పంపే సమాచారాన్ని కడపలో అమలు చేయడానికి సిద్ధంగా కాచుకొని కూర్చున్నారని వివరించారు. ప్రజల అభిమానం, దివంగత నేతను ప్రేమించే ప్రతి గుండె అండదండలు నాకు ఉండగా జగన్ ఏనాడూ ఒంటరి కాదని సగర్వంగా చెబుతున్నానని అన్నప్పుడు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపించింది.
గండికోట ముంపువాసుల పరిహారం ఫైల్‌పై సంతకం
తాను ముఖ్యమంత్రిని అయిన తర్వాత గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన 22 గ్రామాల ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే ఫైలుపై సంతకం చేస్తానని కొండాపురం మండల ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. యువనేత వెంట జిల్లా ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, అమర్నాధ్రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే గురునాధ్‌రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మంత్రి కొణతల రామకృష్ణ తదితరులు ఉన్నారు.