Post date: Aug 16, 2011 6:40:29 AM
ప్రతి చిరునవ్వులోనూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారు. అది చూసి తట్టుకోలేకనే ఆయనపై కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. కృష్ణాజిల్లా ఓదార్పు యాత్రలో జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో, కేంద్రంలో సోనియాగాంధీ అధికారం చెలాయించడానికి వైఎస్సే కారణం. ఆయన తిరిగి రాలేడని తెలిసి కూడా ఆయనపై బురద జల్లడం చాలా బాధగా ఉంది. జగ్గయ్యపేటలో ఇళ్లకు తాళాలు వేసి గ్రామం మొత్తం నాలుగు గంటలుగా నా కోసం ఇక్కడే నిలబడటం చూస్తుంటే నాన్న నన్ను ఒంటరిని చేసి పోలేదని, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని సంతోషమనిపిస్తోంది. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను.
పింఛన్ అందినపుడు పిల్లలు చదువుకుని ఇంజనీరో, డాక్టరో అయినపుడు 108 వాహనం వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లినపుడు, ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం చేసినపుడు వైఎస్ గుర్తుకు వస్తూనే ఉంటారు అని అన్నారు.