Post date: Dec 21, 2011 9:37:57 AM
జిల్లాలోని ఏటుకూరు గ్రామంలోని పంట పొలాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జన్మదిన వేడుకలు రైతులు జరుపుకున్నారు. ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే జగన్ తమ సమస్యలపై స్పందిస్తున్నారని రైతులు అన్నారు. రైతు సమస్యలపై పోరాడుతున్న జననేత జగన్ జన్మదిన వేడుకలు పోలాలలో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారు చెప్పారు. పొలాల మధ్యే కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు.