Post date: Apr 14, 2011 7:51:44 PM
సోనియా, రాహుల్ బొమ్మలతో ప్రచారానికి రండి
వైఎస్ఆర్ క్యాబినెట్ నిర్ణయాలపై హౌస్కమిటీని వేసి ఆయన బొమ్మతో ప్రచారానికి ఎలా వస్తారు?
కోర్టుల్లో ఫిర్యాదులు చేరుుంచి వైఎస్ఆర్పై బురదజల్లుడు
ఒక్కడిని ఓడించడానికి పదిమంది మంత్రులా!
పులి బిడ్డగా పుట్టాడని మీరు గర్వపడేట్లు పనిచేస్తా
బద్వేలు పల్లెల్లో యుువనేత ఉద్వేగ ప్రసంగం
పాలకపక్షం, ప్రతిపక్షం కుమ్మక్కై ఓ పథకం ప్రకారం వైఎస్ఆర్ క్యాబినెట్ సమష్టిగా తీసుకున్న నిర్ణయాలపై హౌస్‌కమిటీ వేసి ఆయనపై బురదజల్లే నీచ రాజకీయాలు చేస్తూ, మళ్లీ ఆయన బొమ్మ పెట్టుకొని ప్రచారానికి ఎలా వస్తారని.. చేతనైతే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బొమ్మలు పెట్టుకొని ప్రచారానికి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో దాదాపు 120 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలసపాడులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. క్యాబినెట్ మంత్రి శంకర్రావు లాంటివారితో హైకోర్టులో ఫిర్యాదు చేయించి వైఎస్ఆర్పై బురదజల్లే కుట్రలకు పాల్పడుతూ తిరిగి వైఎస్ఆర్ మావాడే అంటూ ఎలా ఆయన బొమ్మపెట్టుకుని ప్రచారానికి వస్తున్నారో చెప్పాలని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బొమ్మలను ఎందుకు పెట్టుకొని రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. నీచ రాజకీయాలకు ఇంతకంటే ఉదాహరణలు ఇంకా ఏముంటుందని అన్నారు. ‘ఒక్కడ్ని ఓడించేందుకు పదిమంది మంత్రులను జిల్లాలోకి దింపారు.
ప్రతిపక్షంతో కుమ్మక్కై కుయుక్తులు, కుతంత్రాలు పన్నుతూ వస్తున్నారు. నాన్నను ప్రేమించే ప్రతి గుండె నావెంట ఉండి కుట్రలు, కుతంత్రాలను తరిమికొడతాయి’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. నా గురించి ఆలోచించినప్పుడు.. రాజకీయుంగా ఏ పదవుల్లో ఉన్నా పులికడుపులో పులిబిడ్డ పుట్టింది అని మీరు గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్షం, పాలకపక్షం నేతలు ప్రజలకు చేతనైనంతగా సేవలు చేసి వారి హృదయాల్లో చెరగని ముద్రలు వేసుకోవాల్సిందిపోయి, చనిపోయి రెండేళ్లు అయినప్పటికీ ప్రజల హృదయంలో గూడుకట్టుకున్న వైఎస్ఆర్పై అసూయతో ఆయన్ను ప్రజల హృదయం నుంచి దూరం చేసే కుతంత్రాలు పన్నుతూ, ప్రజలను, ప్రజాసమస్యలను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీచపు రాజకీయాలతో ఎవరెన్ని కుట్రలు పన్నినా మేమున్నాం అన్నా అంటూ పసిపిల్లలు నాకు ధైర్యం నూరి పోస్తున్నప్పుడు.. ఓపిక చాలకున్నా, ఎండలో నాకోసం నిలబడి ఆశీర్వదిస్తున్న అవ్వాతాతల ఆశీర్వాదాలు.. పైన నాన్నగారి ఆశీస్సులు ఉన్నతం కాలం ఈ కుతంత్రాలు తననేమీ చేయలేవని ధీమాను వ్యక్తం చేశారు. పేదవారి ముఖాల్లో చిరునవ్వులు చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకుందామని, వైఎస్ఆర్ పాదాల చెంత పుట్టిన పార్టీని నిలబెట్టుకుందామని అన్నారు. యువనేత వెంట నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీచైర్మన్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి, నెల్లూరు జిల్లా డీసీసీ మాజీ ప్రెసిడెంట్ ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.