Post date: Aug 22, 2011 1:22:5 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో రాష్ట్ర ప్రభుత్వం పడిపోక తప్పదని మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అన్నారు. చెరువుకు గండి చిన్నగానే ప్రారంభవువుతుందని, దానిని ఆపడం ఎవరితరమూ కాద న్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ నుంచి 30 మందే ఉండొచ్చునని, క్రమేపి ఆ సంఖ్య పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇంకా బయటపడనివారెందరో జగన్ కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం పడిపోక తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే పుణ్యం, పురుషార్థం కూడా దక్కుతుందన్నారు.