Post date: Aug 07, 2011 5:26:41 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టనున్న పర్యటన షెడ్యూలు ఖరారైంది. రెండ్రోజుల పర్యటనలో ఆయన క్రాప్ హాలిడే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, రైతుల సమస్యలను తెలుసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకున్న ముగ్గురు అన్నదాతల ఇళ్లకు వెళ్లి.. కుటుంబాలను పరామర్శి స్తారు.
షెడ్యూల్ ఇదీ..
8వ తేదీ: హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం పదిన్నరకు మధురపూడి(రాజమండ్రి) విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు.
11.30 గంటలకు బయలుదేరి రావులపాలెం, కె.పెదపూడి, అంబాజీపేట, బండారులంక, ముమ్మిడివరం, సోమిదేవరపాలెం, అయినాపురం, ఉప్పూడి, సంగవరం, భట్టుపాలెం, అమలాపురం, బెండమూర్లంక ప్రాంతాలలో పర్యటిస్తారు.
రాత్రి 7.40 గంటలకు అమలాపురం జెడ్పీ హైస్కూలు సెంటర్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అంతకు ముందు జగన్ జెడ్పీ హైస్కూల్లోనే రైతు సంఘం నేతలతో సమావేశమవుతారు.
సభ అనంతరం బెండమూర్లంక సెంటర్లో స్థానిక రైతులతో మాట్లాడతారు. రాత్రి 10.35 గంటలకు పర్యటన ముగించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ కుడిపూడి చిట్టెబ్బాయి ఇంట్లో బస చేస్తారు.
9వ తేదీ: ఉదయం 8 గంటలకు అమలాపురం నుంచి బయలుదేరి పి.గన్నవరం, తాటిపాక, లక్కవరం, భట్టేలంక, మట్టపర్రు, రాజోలు పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పర్యటన ముగిస్తారు.