Post date: Apr 21, 2011 5:31:23 AM
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాసుకు రెండు సార్లు ఓడిపోయినా బుద్ది రాలేదని మాజీ శాసనమండలి సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత రెహ్మాన్ గురువారం విమర్శించారు. నిజామాబాద్‌లో ముస్లింలు డిఎస్‌ను రెండుసార్లు ఓడించారని అన్నారు. అయినా డిఎస్‌కు బుద్ది రాక పోవడం శోచనీయం అన్నారు. జగన్‌కు, ముస్లింలకు మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే కాంగ్రెసు పార్టీకి మరోసారి పరాభవం తప్పదని హెచ్చరించారు.
కాగా ఇటీవల పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జగన్నాటకం వెనుక బిజెపి హస్తం ఉందని, రాష్ట్రంలో జగన్‌ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా బిజెపి - జగన్ దోస్తీపై మాట్లాడారు. జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెసు మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని బాజపా, జగన్ దోస్తీ తెరపైకి తెచ్చింది.