Post date: Sep 26, 2011 6:6:49 AM
క్రాప్ హాలీడేకు మద్దతుగా అక్టోబరు 1న విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు కడప ఎంపీ, జననేత వైఎస్ జగ న్మోహనరెడ్డి వెల్లడించారు. మహాధర్నాకు భారీ ఎత్తున తరలిరావాలని రైతులను కోరారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి కృష్ణాజిల్లాలోని దేవరపల్లిలో ప్రసంగించారు. వరి పంట పండించే కంటే ఊరి వేసుకుని చనిపోవటం మేలని రాష్ట్రంలో ప్రతి రైతు భావిస్తున్నారని అన్నారు. ప్రతి పేదవాడి గుండె చప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వినిపిస్తోందని జగన్ తెలిపారు. మాట ఇస్తే కష్టమైనా కట్టుబడి వుండే వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. ఎరువులను సినిమా టికెట్ల మాదిరిగా బ్లాక్లో అమ్ముతున్నారు.