Post date: Sep 20, 2011 3:18:21 PM
కృష్ణా,గోదావరి గ్యాస్ బేసిన్ లో జరిగిన అవకతవకలపై రిలయన్స్ కేసు నమోదు చేసింది. రియలన్స్ సంస్థ గ్యాస్ బేసిన్ లో నిక్షేపాల వెలికి తీత, పెట్టుబడి వ్యయంలోను అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. కాగ్ నివేదిక లో సైతం వీటిని ప్రస్తావించింది. ముఖ్యంగా పెట్టుబడి వ్యయం రెండున్నర డాలర్ల నుంచి సుమార ఎనిమిది డాలర్ల వరకు పెంచిన తీరుపై పలు విమర్శలు వచ్చాయి. గతంలో మంత్రి గా మురళిదేవర రిలయన్స్ కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ నేపధ్యంలోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామాలను పురస్కరించుకుని సిబిఐ రిలయన్స్ పై కేసు పెట్టడం సంచలనంగానే ఉంది.కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్న రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఈకేసును ఎలా ఎదుర్కుంటారు? ప్రభుత్వం దీనికి ఏమి జవాబు ఇస్తుందన్నది ఆసక్తికరం. కెజి గ్యాస్ బేసిన్ లో జరిగిన అవినీతి ఆరోపణలపై కేసు దర్యాప్తు చేసి వాస్తవావస్తవాలను నిర్దారణ చేసి వేల కోట్లను తిరిగి రాబట్టగలిగితే సిబిఐని అభినందించవచ్చు.