Post date: Aug 14, 2011 6:6:53 AM
నవంబర్లో కోచిలో భారీ బహిరంగ సభ !!
కేరళలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఆ రాష్ట్ర తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పరమేశ్వరన్, కార్యదర్శి మనోజ్ శంకర్నెట్లూర్లు తెలిపారు. శనివారమిక్కడ వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. తమ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ శాఖను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అక్కడ పార్టీ శాఖను ఏర్పాటు చేస్తే పంచాయతీ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు సహా వేలాదిమంది చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
పార్టీ శాఖ ఏర్పాటు గురించి చర్చించడానికే తాము పులివెందులకు వచ్చామని తెలిపారు.