Post date: May 15, 2011 9:8:54 AM
రాష్ట్రంలోని పలు సమస్యలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, అధికార కాంగ్రెసు పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు ఆదివారం గుంటూరు జిల్లాలోని రైతుదీక్ష ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వలె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల హృదయాల్లో నిలిచి పోయారన్నారు.
ప్రజా సమస్యలపై జగన్ అనేక పోరాటాలకు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రజా సమస్యలపై ఇకనుండి జగన్ అలుపెరగని పోరాటం చేస్తారన్నారు. అధికార కాంగ్రెసు చంద్రబాబు దీక్షలు చేస్తే ఓ రకంగా, జగన్ దీక్షలు చేస్తే ఓ రకంగా స్పందిస్తుందన్నారు. హైటెక్ సిఎం చంద్రబాబును రైతులు నమ్మె పరిస్థితి లేదన్నారు. రైతులపై ఆయనది మొసలి కన్నీరు అన్నారు.