Post date: Aug 27, 2011 5:31:4 AM
కాంగ్రెస్‌కు దమ్ముంటే తమ రాజీనామాలను ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఎవరు నీతిపరులో తేలాలంటే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రజా కోర్టుకు రావాలని, ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నది సత్తిబాబేనని ఆయన ఆరోపించారు. అవినీతిపై చంద్రబాబు పోరాటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బాలినేని అన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకుంటూనే ఆయన కోసం రాజీనామా చేసిన వారిని తప్పుబట్టడాన్ని ఆమె నిలదీశారు. రాజీనామాలు ఆమోదిస్తే ప్రజాక్షేత్రంలో ఎవరి బలమెంతో తేలుతుందన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు లేదని ఆమె అన్నారు. తమకు పదవి ముఖ్యం కాదని వైఎస్ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు దమ్ముంటే జగన్ వర్గ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను ఆమోందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ చేశారు. తాము వైఎస్సార్ ఫోటోతో వస్తామని, కాంగ్రెస్ వారు సోనియా బొమ్మతో పోటీ చేయాలన్నారు. వైఎస్సార్ బొమ్మ లేకుండా గెలవగలమని నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని బొత్సకు గట్టు రామచంద్రరావు సూచించారు.