Post date: Aug 24, 2011 4:47:37 AM
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం
నింద తొలగిపోవాలంటూ పూజలు
కాంగ్రెస్, టీడీపీల కుట్రల నుంచి వైఎస్ జగన్
బయటపడాలంటూ సర్వమత ప్రార్థనలు
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
రాజీనామాలు చేయాలని డిమాండ్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. జిల్లాలోని 30కు పైగా మండలాల్లోని పలు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్దన్‌రెడ్డి గాంధీబొమ్మ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
న్యూస్‌లైన్ నెట్వర్క్: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కుట్రపన్ని మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబాన్ని అభాసుపాలు చేసేం దుకు సీబీఐని పావుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. సీబీఐ ఎఫ్ఐఆర్లో మహానేత పేరు చేర్చినందుకు నిరసనగా పలు జిల్లాల్లో మంగళవారంకూడా ఆందోళనలు కొనసాగాయి. వైఎస్‌పై పడిన నింద తొలగిపోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి నివాళులర్పించారు. భీమవరంలో పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్ రాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం, తణుకు ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడించి, వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. పలాస-కాశీబుగ్గ, నందిగాం మం డలం మర్లపాడులో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు జరిగాయి. శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ సర్కిల్, నరసన్నపేటలోని వైఎస్ఆర్ జంక్షన్, రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండల పరిధి ఎం.సీతారాంపురం, పాలకొం డ మండలం ఎం. సింగుపురం, సరుబుజ్జిలి, పొందూరులలో వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. విశాఖలో పార్టీ నగర కన్వీనర్ రవిరాజు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అంతకుముందు పాదయాత్ర నిర్వహించి గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో వైఎస్ విగ్రహాలకు పెద్దఎత్తున క్షీరాభిషేకాలు నిర్వహించారు.
సర్వమత ప్రార్థనలు : వైఎస్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు నిరసనగా, కాంగ్రెస్, టీడీపీల కుట్రల నుంచి వైఎస్ జగన్ క్షేమంగా బయటపడాలని కోరుతూ పలు జిల్లాల్లో ప్రార్థనలు నిర్వహించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో యునెటైడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల జవహర్, అంతర్జాతీయ దైవసేవకుడు రెవరెండ్ కాటూరి మోజెస్ ఆధ్వర్యంలో క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు.
రాష్ట్రంలోని క్రైస్తవులందరూ జగన్, విజయమ్మలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, నగర ఎన్నికల పరిశీలకుడు పి. గౌతమ్‌రెడ్డి, పార్టీ పెనమలూరు, నందిగామ ఇన్చార్జిలు పడమట సురేష్‌బాబు, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో రోడ్డుపైనే ఉపవాస విరమణ చేసి, నిరసన తెలియజేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా నాగుల వలస అభయాంజనేయస్వామి ఆలయంలో వైఎస్ అభిమానులు పూజలు చేశారు.
స్వాగత ర్యాలీలు.. సన్మానాలు: రాజీనామాలుచేసిన ప్రజాప్రతినిధులకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. రాజీనా మా చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన కర్నూ లు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డికి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్శ్రేణులు భారీ స్వాగతం పలి కారు. బైక్‌ర్యాలీలు నిర్వహించారు. అనంతరం భారీ సభ ఏర్పాటు చేసి సన్మానం చేశారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం, సంబేపల్లి మండలాల్లో ర్యాలీలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు చంద్రశేఖరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎంపీ మేకపాటి రాజ మోహన్‌రెడ్డితోపాటు, రాజీనామా చేసిన ఇతర ఎమ్మెల్యేలకు బాసటగా ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వైఎస్ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు.
‘పనబాక’ ఘెరావ్, కమలమ్మకు నిరసన
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఘెరావ్ చేశాయి. విమానాశ్రయం నుంచి మంత్రి వెలుపలికి రాగానే హస్తం గుర్తులో ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రణబ్‌ముఖర్జీ, టీడీపీ నాయకుడు ఎర్రన్నాయుడు చిత్రాలున్న ప్లకార్డులతో కార్యకర్తలు నిరసన తెలిపారు. అవినీతి కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఘెరావ్ చేశారు. అంతకుముందు అదే విమానంలో వచ్చిన బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మను రాజీనామా చేయాలని కోరారు. వైఎస్ఆర్ అభిమానుల మద్దతుతో గెలిచిన మీరు ఆ పదవికి రాజీనామా చేయాలంటూ నినదించారు. తన ఆరోగ్యం సరిగా లేదని, తొందరగా వెళ్లాలని ఆమె విన్నవించడంతో కార్యకర్తలు వదలివేశారు.
వీధుల్లో ఇఫ్తార్
సీబీఐ ఎఫ్ఐఆర్లో మహానేత వైఎస్ పేరు చేర్చినందుకు నిరసనగా మంగళవారం వీధుల్లో ఇఫ్తార్ విందు ఇవ్వాల్సిందిగా మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత రెహ్మాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలుచోట్ల ముస్లిం సోదరులు స్పందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సిటీ సెంటర్ మాల్ వద్ద మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రోడ్డుపైనే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అలాగే, గుంటూరు అహ్మద్ నగర్లో, కృష్ణా జిల్లా పెడనలో, చిత్తూరు జిల్లా వి.కోటలో జాతీయ రహదారిపై, కర్నూలులో రోడ్డుపై, నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్లలో వీధుల్లో ఇఫ్తార్ విందు ఇచ్చారు.