Post date: Sep 27, 2011 5:4:44 PM
మంగళవారం చిట్టినగర్ సెంటర్ అశేష జనవాహని మధ్య కిక్కిరిసింది. యువనేత, కడప ఎంపీ జగన్మోహనరెడ్డి చిట్టినగర్ సెంటర్ ఓదార్పు యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. యువనేత రాక ఎంత ఆలస్యం అయినప్పటికీ అభిమానులు ఓపికగా ఎదురు చూసి అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడ అభిమానులు, కార్యకర్తలు జగన్కు జయ జయ ధ్వానాల మధ్య స్వాగతం పలికారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం ఆ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది మహానేత వైఎస్ఆర్ అని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు, దేశానికే చాటి చెప్పిన వ్యక్తి వైఎస్ఆరేనని అన్నారు. ఆయన పాలనలో రైతుకు భరోసా ఉండేదని అందుకే ప్రతీ రైతు సోదరుని మనుసులోనూ వైఎస్ఆర్ నిలిచి పోయారని జగన్ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. రైతుకు ఏ కష్టమొచ్చినా.. మన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉన్నారనే ధీమా ఉండేదని జగన్ అన్నారు. వైఎస్ఆర్ పాలనలో సువర్ణ రాజ్యాన్ని చూశాం, మళ్లీ త్వరలోనే ఆ రాజశేఖరుని సువర్ణ యుగాన్ని చూస్తామని అన్నారు.