Post date: Aug 17, 2011 2:50:53 PM
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది ముమ్మాటికీ హత్యేనని ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. ఆయన మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. లోతైన విచారణ జరిపితే నిజానిజాలు వెల్లడవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులను బాధ్యులను చేసి తప్పుకోవాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. వనరులను రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగించాలని వైఎస్ఆర్ తపించారన్నారు. అది నచ్చనివారే కుట్రకు పాల్పడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు.