Post date: Mar 02, 2012 7:9:52 AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న కార్మిక విభాగానికి సంబంధించి పలు జిల్లాలకు, నగరాలకు కన్వీనర్లను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లాకు సి.హెచ్.రాఘవబాబు,
తిరుపతి నగరం- ఆర్.గురువారెడ్డి,
రంగారెడ్డి-బండ్ల శ్రీనివాస్,
వైఎస్ఆర్ జిల్లా- జి.ఎన్.ఎస్.మూర్తి,
కడప నగరం- అందె సుబ్బారాయుడు,
కర్నూలు- బి.అజయ్ కుమార్,
మెదక్- నర్రా భిక్షపతి, విజయవాడ నగరం- విశ్వనాథ్ రవి,
కరీంనగర్- పి.ధర్మపురి,
ఖమ్మం- ఎస్.వెంకటేశ్వర్లును నియమించినట్లు చెప్పారు.
అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా మహిళా విభాగం కన్వీనర్‌గా మేకల ప్రమీలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.