Post date: Aug 24, 2011 10:0:27 AM
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఏక వాక్యంతో ఆయన తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు సమర్పించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చటం వల్లే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.
సీబీఐ ఎఫ్ఐఆర్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును పేర్కొనటం ఘోరమని ఎంపీ పదవికి రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన తన రాజీనామా అనంతరం బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఈ విషయంలో తానే కాదని... రాష్ట్ర ప్రజలు కూడా మనస్తాపం చెందారన్నారు. రాజీనామాల ద్వారా తమ నిరసనలు తెలిపామని మేకపాటి అన్నారు.
ప్రతిపక్షం, అధికారం పక్షం కుమ్మక్కై జగన్‌ను రాజకీయాల్లో ఎదగనివ్వకుండా కుట్రలు పన్నుతున్నాయని మేకపాటి వ్యాఖ్యానించారు. నిస్సహాయంగా ఉన్నారని భావించే ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ సీఎం కావాలని సంతకాలు చేసినవారే తర్వాత దూరం అయ్యారని ఆయన గుర్తు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన జనం మాత్రం జగన్ వెంటే ఉంటారన్నారు. ధర్మం ఉంది కాబట్టే జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు పలికానని మేకపాటి అన్నారు. తన రాజకీయ జీవితమంతా రహదారేనని, ఎత్తులు, జిత్తులు లేవని ఆయన తెలిపారు.