Post date: Apr 14, 2011 7:47:9 PM
విజయమ్మపై అడుగడుగునా పూల వర్షం
కంటతడిపెడుతున్న మహిళలు
మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్.విజయమ్మ ప్రచారం శ్రీరామనవమి పండుగ వేళ కొత్త శోభను సంతరించుకుంది. ఆమె పులివెందుల పట్టణ పరిధిలోని బసిరెడ్డిపల్లె, చిన్నన్నరూముల, ముద్దనూరురోడ్డు, బుల్లా వీరప్ప వీధి, పుల్లారెడ్డి ఆస్పత్రి ప్రాంతాలలో మంగళవారం ఇంటింటి ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా ప్రజలు విజయమ్మకు ఎదురేగి అడుగడుగునా పూలవర్షం కురిపించారు. ఆమెను చూడగానే కొందరు మహిళలు ఆత్మీయ ఆలింగనం చేసుకుం టూ కన్నీరు పెట్టారు. ప్రతిఇంటి వద్ద కుంకుమ బొట్లు, దీపాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వద్దు వద్దం టున్నా మహిళలు పోటీలు పడి మరీ.. గుమ్మడికాయ, ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తున్నారు. మంగళ హారతులిచ్చారు. పూలవర్షం కురిపిం చారు. శ్రీరామనవమి పండుగ దినాన ఇంటికొచ్చిన ఆడపడుచుకు ప్రసాదాలు అందించి ఆత్మీయత చాటారు. విజయమ్మ .. ఉదయం 8.30గంటలకే బసిరెడ్డిపల్లె శ్రీరామాలయం, వినాయకుని గుళ్లో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.
‘జై జగనన్నా.. జై విజయమ్మ’ అంటూ పులివెందుల వీధుల్లో జనం ఆమె వెంట కదిలారు. ‘ఆపద సమయంలో మమ్ములను ఆదుకున్న దేవుడమ్మా. ఎందరికో పునర్జన్మనిచ్చారు. ఆయనలేక మీకీ కష్టాలు’ వచ్చాయని విజయమ్మను చూడగానే పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా ఓట్లు మీకే వేస్తామమ్మా. అని మహానేత సతీమణికి బాసటగా నిలిచారు. కాగా, ప్రజాభి మానంలో తడిసి ముద్దవుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా విజయమ్మ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని కొనసాగించారు. యువనేత సతీమణి వైఎస్ భారతి సైతం అత్తకు తోడు తగా ప్రచారంలో ఓటర్లతో మమేకమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఆమె పులివెందుల లో విస్తృత ప్రచారం చేశారు. వీరిద్దరి ప్రచారాన్ని వైఎస్ మనోహర్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నారు. ఇంకా వీరి ప్రచారంలో వైఎస్ కుటుంబ సభ్యులు ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్ జగన్ మేనత్త విమలమ్మ, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన సతీమణి రేవతి తదితరులు పాల్గొన్నారు.