Post date: Aug 15, 2011 12:39:12 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి ప్రకటించిన 'అమ్మ ఒడి' ఆలోచనకు పోరెడ్డి ప్రభాకర రెడ్డి స్పందించారు. తాను కొంతమంది విద్యార్థులకు సహాయం చేస్తానని ముందుకు వచ్చారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. సింహాద్రిపురం మండలం హిమకుంట్ల పాఠశాలలోని ఎస్.సి,ఎస్.టి విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి 300 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు.