Post date: Aug 14, 2011 5:45:7 AM
అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ కు లేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ నేత కొండా సురేఖ అన్నారు. శనివారం రాఖీ పౌర్ణమి సంధర్భంగా సురేఖ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్. వద్ద వైఎస్ సమాధికి నివాళులు అర్పించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన ఏఐసీసీ ఇప్పటివరకూ పరామర్శించలేదని విమర్శించారు.
వైఎస్‌కు సన్నిహితంగా ఉన్నారన్న కారణంగానే అధిష్టానం వీరప్ప మొయిలీ పదవి మార్చిందని, సా యిప్రతాప్ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించిందని అన్నారు. జగన్‌పై హైకోర్టులో పిటిషన్ వేసినందుకే శంకర్రావుకు మంత్రి పదవి వరించిందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌పై మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆమె సవాల్ విసిరారు.