Post date: Apr 15, 2011 6:50:9 AM
ఇడుపులపాయ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయన సతీమణి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పులివెందుల అభ్యర్థి విజయమ్మ శుక్రవారం కన్నీటి పర్యంతమయ్యారు. కడప లోకసభ స్థానానికి నామినేషన్ వేసే ముందు వైయస్ జగన్ తండ్రి వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
జగన్ నామినేషన్ పత్రాలను ఆమె వైయస్సార్ సమాధిపై ఉంచి ఆ తర్వాత జగన్కు అందించారు. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జగన్ వైయస్సార్ సమాధికి నివాళులు అర్పించారు. కొద్దిసేపు మౌనంగా ప్రార్థనలు చేశారు. అనంతరం నామినేషన్ వేసేందుకు యువనేత బయలుదేరారు.