Post date: Aug 11, 2011 5:28:11 AM
మనం కష్టకాలంలో ఉన్నాం. చట్టంపై నమ్మకం ఉంది. నాలుగు రోజులు ఆగితే మంచి రోజులు వస్తాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానన్న కారణంతో ఇదంతా చేస్తున్నారు.దేవుడనేవాడు ఉన్నాడు .. ఆయన అన్నీ చూస్తున్నాడు.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో బుధవారం సాయంత్రం ఓ ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
పార్టీ పెట్టిన రోజే కష్టాలు, నష్టాలు వస్తాయని తెలుసని, తాను కాంగ్రెస్ను వీడిన వెంటనే వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. నవంబరు 29న ఆ పార్టీకి రాజీనామా చేశానని, డిసెంబరు 29న ఐటీ నోటీసులు పంపారని తెలిపారు. అంతటితో సంతృప్తి చెందక, మంత్రి శంకర్రావుతో కేసు వేయించారన్నారు. నైతిక విలువలను పక్కనపెట్టి టీడీపీ.. వారికి జత కలిసిందన్నారు.