Post date: Sep 24, 2010 7:0:31 AM
ప్రియతమ నాయకులు దివంగత నేత ముఖ్య మంత్రి రాజశేఖర్
రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా సంతాప కార్యక్రమాలు పలు
ప్రాంతాల్లో రెండు రోజులు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జగన
హాండ్స్ యూత్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జూపూడి జసింత్ పర్య
వేక్షణలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా జగన్ హంద్స్
ప్రెసిడెంట్ సురజ్ క్రిస్టీ కుమార్ గారు , జగన్ యువసేన రాష్ట్ర
ఉపాధ్యక్షులు మేడిది జాన్సన్ గారు , కౌన్సిలర్ కోడి యుగంధర్
గారు పాల్గొన్నారు . ఈసందర్బంగా పేదలకు , వృద్ధులకు , విధవ రాండ్రులకు
చీరలు దుప్పట్లు పలహారాలు పంచి పెట్టారు .
మేడిది జాన్సన్ గారు మాట్లాడుతూ YSR పాలన స్వర్ణయుగం అని ఆయన
చనిపోయెన తర్వాతా రాష్ట్రం లో సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయే
పరిస్థితి ఏర్పడింది అని , మరలా స్వర్ణ యుగం రావాలంటే జగన్
అన్నని ముఖ్య మంత్రిని చేస్తే పథకాలు కొనసాగుతాయి అని తెలిపారు
.కోడె యుగంధర్ గారు మాట్లాడుతూ జగన్ అన్నను ఆదర్శంగా తీసుకొని
JHYIA ( JAGAN HANDS YOUTH INSPIRED ASSOCIATION) చేస్తున్న
కార్యక్రమాలను అభినందిచారు .
కొట్టుసుబ్బరావు అనే వికలాంగుడు YSR గురించి సాక్షం చెపుతూ ,
''నేను తెలుగు దేశం పార్టీ వీరాభిమానిని ఆ ప్రభుత్వం లో ఏ
సాయం అందలేదు . అప్పుల బాధలో చిక్కుకొని, ఎవరు సహాయం అందించని
పరిస్థితిలో ఆత్మ హత్య చేసుకుందాం అని అనుకుంటున్నా సమయంలో ,
రాజశేకర్ రెడ్డి అధికారంలోకి రావటంతో , వికలాంగుడైన నాకు
వ్యాపారం చేసుకొనుటకు 30,000 వేలు లోన్ రావటంతో ఆ డబ్బుతో
Resthouse
రోడ్ లో షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నానని తెలిపాడు మరియు నెలకు
500 రూపాయిలు పెన్షన్ వస్తుంది'' అని రాజశేకర్ రెడ్డి గారి ఋణం
ఎప్పటికి తీర్చు కోలీనని అన్నారు . JHYIA ప్రెసిడెంట్ సూరజ్
క్రిస్టీ కుమార్ గారు మాట్లాడుతూ JAGANISM అంటే రాజశేకర్ రెడ్డి
గారి భావాలు కలిగి ఉండటమే జగనిజం అని తెలిపారు . జగన్ అన్నని
ముఖ్యమంత్రి గా చూడటమే జగనిజం విజన్ అని తెలిపారు . 'JHYIA '
కార్యదర్శి జూపూడి జసింత్ మాట్లాడుతూ YSR లేని లోటుని జగన్ అన్న
మాత్రమె తీర్చగలరని కన్నిటిపర్యంతం అయ్యారు . ఈ కార్యక్రమంలో Ch
Swamyraju, krishna, Samuel T ,John, Benny , N johnson, Georgre , k
వెంకటేష్, Prasad babu D, Prasad B, తదితరులు పాల్గొన్నారు.
--