Post date: Aug 18, 2011 9:36:1 AM
సిబిఐ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తల్లి, పులివెందుల శానససభ్యురాలు వైయస్ విజయమ్మ అన్నారు. ఆమె కడప జిల్లా పులివెందుల నుంచి గురువారం ఉదయం హైదరాబాదులోని లోటస్పాండులో గల నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సమయంలో ఆమె ఆ వ్యాఖ్య చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని, ఈ విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. అంతకు మించి మాట్లాడడానికి ఆమె నిరాకరించారు.