Post date: May 14, 2011 6:19:5 AM
‘‘ఇది దేవుడిచ్చిన విజయం. మీ ప్రేమ, అభిమానాలే వైఎస్సార్ ఆత్మకు శాంతి...’’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ ఉద్వేగభరితంగా అన్నారు. శుక్రవారం మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుని వివాహానికి ఒంగోలు వచ్చిన ఆమె.. అభిమానులనుద్దేశించి మాట్లాడారు. ఉదయం 11.45 గంటలకు వివాహ వేదిక వద్ద నుంచి బయల్దేరి బయటకు రాగానే కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.. జగన్ జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆమె అక్కడ్నుంచి బయల్దేరారు.