Post date: Aug 31, 2011 9:31:16 AM
కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన తొలివిడత ఓదార్పుయాత్ర బుధవారం ముగిసింది. కొత్త రావిచర్లలోని వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన యాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు.
సెప్టెంబర్ 2వ తేదీన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వితీయ వర్థంతి సందర్భంగా వైఎస్ జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. దాంతో ఓదార్పు యాత్రకు స్వల్ప విరామం ఏర్పడింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి కృష్ణాజిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ యువనేత 22 కుటుంబాలను పరామర్శించారు.