Post date: Aug 22, 2011 4:12:41 AM
‘భోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ మొదటి ముద్దాయిగా ఉన్నారు. రాజీవ్ చనిపోగానే సీబీఐ రాజీవ్ గాంధీ పేరును తొలగించింది. ఆయన చనిపోయినందుకు పేరు తొలగిస్తున్నట్లు తెలిపింది. కానీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఆయన పేరు పెట్టడం’’ నాకు నచ్చలేదని ఎంపీ సబ్బం హరి అన్నారు.
తాను ఇప్పటి వరకు కాంగ్రెస్ ను విమర్శించలేదని, జగన్ పార్టీని వీడితే కాంగ్రెస్ నష్టం అని మాత్రమే చెప్పానని సబ్బం అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వై ఎస్ పేరు పెట్టడం, జగన్ ను ఇబ్బందులు పెట్టడం తనకు నచ్చలేదని, కాంగ్రెస్ లో వుంటే సరి లేకుంటే వేధిస్తాం అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని, అందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు సబ్బం తెలిపారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, ప్రజలు ఆదరిస్తే అధికారంలోకి వస్తారని, లేకుంటే మిన్నకుంటారని అన్నారు. తమకు నచ్చిన పార్టీలోవుండే హక్కు అందరికీ ఉందని సబ్బం హరి తెలిపారు.