Post date: Mar 07, 2012 6:29:26 AM
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జగన్ కుడితిపాళెంలో కొంత సేపు ఆగి తన ప్రచార రథంలో నుంచే ములాయం, అఖిలేష్‌కు ఫోన్ చేశారు. యూపీ అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నానని అన్నారు. ఎస్పీ నేతృత్వంలో యూపీ ప్రగతిపథంలో నడవాలని జగన్ ఆకాంక్షించారు.