Post date: Jan 30, 2011 1:58:7 PM
సంక్రాంతి తెల్లారి కార్లో ఆఫీసుకు వస్తున్నాను.
రోడ్ల మీద ఎందరో పిల్లలు!
అమ్మ చేతులు పట్టుకుని, భుజాలకు బ్యాగులు వేసుకుని, ఆటోల్లో వెళ్తూ, తాతయ్యలు, అమ్మమ్మలకు టాటాలు చెబుతూ, మాట్లాడుకుంటూ, నవ్వుతూ, ఏడుస్తూ, ఇద్దరుగా, ముగ్గురుగా రకరకాల పిల్లలు రకరకాలుగా స్కూళ్లకు వెళ్తున్నారు. పండగంతా నాకు వాళ్ల కళ్లల్లోనే కనిపించింది.
నిన్నటిదాకా ఆడుతూపాడుతూ గాలిపటాలు ఎగరేసిన చేతులు మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడతాయేమో అనుకుంటూ ముందుకు వస్తుంటే, నాకు మళ్లీ గాలిపటాలు కనిపించాయి.
అరే, సంక్రాంతి అయ్యాక కూడా గాలిపటాలు ఎలా కనబడ్డాయని అనుకుంటున్నారా?
అన్నీ ఉరేసుకున్న గాలిపటాలు!
విద్యుత్ తీగలకు చిక్కుకుని, చెట్టుకొమ్మల్లో ఇరుక్కుని, నిర్మాణం పూర్తికాని బిల్డింగులకు వేలాడుతూ నిజంగా అవి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టే కనిపించాయి.
ఆ గాలిపటాలను చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలే గుర్తొచ్చారు.
గాలిపటానికి దారం ఆధారం. ఆ దారం లాంటి ప్రభుత్వం సరైన ఆధారంగా నిలబడకపోతే అలాగే జరుగుతుందనిపించింది.
కానీ, అంతలోనే నాకు రెండో ఆలోచన కూడా వచ్చింది.
గాలిపటం ఎగరడానికి గాలి కావాలి. కాని అది ఇంకా ఎత్తుకు, ఇంకా పైపైకి ఎగరాలంటే మాత్రం, అది ఆ గాలికి ఎదురీదినప్పుడే సాధ్యమవుతుంది. ఎదురు తిరగకపోతే గనక, గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది. పెకైగరడం అటువుంచి దాని ఉనికినే కోల్పోతుంది. అందుకే దీన్ని మన రైతన్నలకు గుర్తుచేస్తూనే కుటుంబాలన్నీ స్వీకరించాల్సిన నీతి కూడా ఇందులో ఉందనిపించింది.
మన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లే ఈ గాలి. ఆ గాలికి ఎదురు నిలబడినప్పుడే మనం పైకి ఎదుగుతాం.
అయితే, రైతన్నలకు కష్టం వచ్చినప్పుడు సమాజం మొత్తం వారికి ఆధారంగా నిలబడాలి. కుటుంబంలో ఒకరికి ఇబ్బంది తలెత్తినప్పుడు కుటుంబసభ్యులందరూ వారికి ప్రేమదారంగా ఉండాలి. అప్పుడు కష్టం గాలిలా తేలిపోతుంది. అనుబంధం ఆకాశమంత విస్తరిస్తుంది.
ప్రాజెక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ నిర్మించాలన్నదే నా లక్ష్యం.....
మట్టిని నమ్ముకున్న వ్యక్తీ రాబోయే రోజుల్లో ధనవంతుడు కావలి....
జల ప్రోజేక్టులుపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని వమ్ము చేయకూడదు....
ఆంధ్రప్రదేశ్ ని దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనే నా స్వప్నం.....
ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు మన దివంగత నేత ప్రియతమ నాయకుడు శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి...
తండ్రి బాటలో తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేసే అలుపెరుగని పోరాటానికి మనం అందరం సహకరిద్దాం.
వై.ఎస్.ఆర్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం.
జోహార్ వై.ఎస్.ఆర్
జై జగన్