Post date: Mar 20, 2012 12:10:7 PM
తూర్పుగోదావరి జిల్లాలో ఉప ఎన్నిక జరగనున్న రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ మొదటి వారంలో పర్యటించనున్నట్టు పార్టీ కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం కాజులూరు మండలంలోని నామవానిపాళెంలో ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బోస్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పోలవరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుని 5, 6, 7 తేదీల్లో రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం, కె. గంగవరం, కాజులూరు మండల గ్రామాల్లో రోడ్డు షోలను నిర్వహిస్తారని తెలిపారు.