Post date: Aug 19, 2011 5:42:41 AM
యువనేత వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని సినీ రచయిత పోసాని కృష్ణమురళి ఆరోపించారు. జగన్‌ను ఎంత అణగదొక్కాలని చూస్తే అంతపైకి వస్తాడని ఆయన అన్నారు.
జగన్ అవినీతిపరుడయితే గతంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఎందుకు చెప్పారని పోసాని ప్రశ్నించారు. బీఆర్ అంబేద్కర్ అంతటి మహానుభావుణ్నే కాంగ్రెస్ వదిలిపెట్టలేదని, జగన్ ను మాత్రం వదిలి పెడుతుందా అని అన్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉంటే సీబీఐతో దాడులు చేయించేవారా ? కాంగ్రెస్ జగన్ పై సీబీఐ దాడులు చేయించి వైఎస్ కాంగ్రెస్ కు చేసిన సేవలకు ప్రతిఫలం అందించిందని విమర్శించారు.