Post date: Apr 15, 2011 6:5:57 AM
రోడ్ షోలో యువనేత జగన్
ప్రజల బాగోగులను గాలికి వదిలేశారు
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయి
నీవెంట మేమున్నామంటూ జనం నినాదాలు
విశ్వసనీయుతను పక్కనపెట్టి ఆత్మవంచన చేసుకుంటే తనకు కేంద్రంలో మంత్రిపదవి, సోనియా వద్ద మంచి స్థానం లభించేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కానీ వూటకు కట్టుబడి... పులివెందుల ముద్దుబిడ్డ అంటే ఇలా ఉండాలని మీతో అనిపించుకోవడానికి, నాన్న నేర్పిన ఆత్మగౌరవానికి విలువ ఇచ్చి ఈ రోజు మీ ముందు నిలబడ్డానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం పులి వెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో ప్రసంగించారు. కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు మంచికి-చెడుకు, న్యాయానికి-అధర్మానికి, విశ్వసనీయుతకు-వంచనకు, ఆత్మగౌరవానికి-నిరంకుశపాలనకు, వైఎస్సార్‌కు-సోనియూకు వుధ్య జరుగుతున్నపోరని అభివర్ణించారు.
‘గతంలో కాంగ్రెస్- ఐ అంటే ఇండియన్ కాంగ్రెస్ అని పిలిచేవారు.. అది కాస్తా ఇందిరా కాంగ్రెస్‌గా మారి.. ఇప్పుడు ఇటాలి యన్ కాంగ్రెస్ అయిందని’ ఎద్దేవా చేశారు. ఎంతకాలం జీవించావున్నది కాదు...ఉన్నన్నాళ్లు ఎలా బతికామన్నదే ముఖ్యమని నాన్న ఎప్పుడూ చెప్పేవారని.. ఆయన బిడ్డగా, మీ అందరివాడిగా ఆత్మగౌరవానికే ప్రాధాన్యతనిచ్చానన్నారు. విశ్వసనీయతను పక్కనపెట్టి ఉంటే ఆప్యాయతను, మీ అభిమానాన్ని చూరగొనలేక సాధారణ నాయకుడిగా మిగిలి ఉండేవాడినని ఉద్వేగంగా అన్నారు. ఈ బాటలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఉన్నా మీరు చూపించే ఆదరాభిమానాలే నాకు శ్రీరామరక్ష అన్నారు.
ఈ సీఎంలకు, పీఎంకు ఎందుకు తట్టలేదు..
పేదల కన్నీరు తుడవడానికే దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీకిరుణాలు, ఫీజ్ రీయిబర్స్‌మెంట్ పథకాలను ప్రవేశపెట్టారని... దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, సీనియర్ నాయకులు ఉన్నా పేదల కోసం ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టాలన్న ఆలోచన వారికి ఎందుకు రాలేదని జగన్ ప్రశ్నించారు. అప్పుల పాలై జీవచ్ఛవాలుగా మారుతున్న పేదల కష్టాలపై ప్రత్యక్షంగా అవగాహన ఉన్న ఒక్క రాజశేఖరరెడ్డే వాటిని అమలు చేశారని తెలిపారు. మళ్లీ వైఎస్ పాలన రావాలంటే ఆయన పాదాలచెంత పుట్టిన తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం మెద్దు నిద్దుర పోతోంది. ప్రభుత్వ వైఫల్యాన్ని కాలర్ పుచ్చుకుని నిలదీయాల్సిన ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షంతో కుమ్మక్కయి, ప్రజల బాగోగులను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.
వుండుటెండను లెక్కచేయుక...
తొండూరు మండలంలో నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. గ్రామ గ్రామాన పూలు చల్లుతూ...డప్పు వాయిద్యాలు.. బాణసంచా పేల్లుళ్ల మధ్య.. పల్లెలన్నీ ప్రచారంలో ఆయన వెంట కది లాయి. సంక్షేమ పథకాలు,విశ్వసనీయుత..అంశాలను ప్రస్తావించినపుడు చప్పట్లు కొట్టారు. పులివెందుల బిడ్డను అన్నప్పుడు...జేజేలు పలికారు. క్రిష్ణంగారిపల్లె,గుండ్లమడుగు, సైదాపురం, మడూరు, తేలూ రు, టి.తుమ్మలపల్లె, ఇనగలూరు, అగడూరు, యాదవవారిపల్లె, చెన్నంపల్లె, బలిజపల్లె, గంగనపల్లె, పోతులపల్లె, చెర్లోపల్లె, ఊడవగండ్ల, గంగాదేవిపల్లెల్లో రోడ్‌షో కొనసాగింది.