Post date: May 22, 2011 12:42:5 PM
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ విప్ ఉదయభాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన ఉదయభాను వైయస్ జగన్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు స్థానిక నేతలు కూడా జగన్ పార్టీలో చేరారు. కృష్ణా జిల్లాలో కాంగ్రెసు పార్టీకి కీలక వ్యక్తిగా ఉన్న ఉదయభాను వెళ్లి పోవడంతో పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.
ఆయనే కాకుండా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని దాదాపు అందరు నేతలు, కార్యకర్తలు ఆయనతో పాటే వైయస్ఆర్ కాంగ్రెసు బాట పట్టారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ తాను తీసుకున్న ఈ నిర్ణయానికి నియోజకవర్గంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రోజు రోజుకి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ బలపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై దాడి చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.