Post date: Mar 20, 2012 12:19:0 PM
వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర మంగళవారం నుంచి గుంటూరు జిల్లాలో పునఃప్రారంభం కానుంది. ఇప్పటికి పలు విడతలుగా గుంటూరు జిల్లాలో 71రోజులపాటు 13 నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర కొనసాగింది. గతేడాది అక్టోబరు 16వ తేదీన మంగళగిరి నియోజకవర్గం సీతానగరం నుంచి ప్రారంభమైన యాత్ర ఈ నెల 1వ తేదీన వినుకొండ నియోజకవర్గం వెల్లటూరు గ్రామంలో ముగిసింది. నెల్లూరు జిల్లా కోవూరు ఉపఎన్నికల ప్రచారం, ఇతర కార్యక్రమాల అనంతరం తిరిగి ఓదార్పు యాత్ర మంగళవారం వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం కారుమంచి గ్రామం నుంచి ప్రారంభం కానుంది. కారుమంచిలో వైఎస్సార్ మరణం తట్టుకోలేక మృతిచెందిన అంగడి అచ్చమ్మ కుటుంబాన్ని ఓదార్చడంతోపాటు వైకల్లు, గుంటుపాలెం, భాస్కర్‌నగర్, చిన్నకంచర్ల, ముండ్రువారిపాలెం గ్రామాల్లో యాత్ర కొనసాగుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.