Post date: May 20, 2011 6:19:13 AM
విజయనగరం జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్ర ఎప్పుడు నిర్వహిస్తారా? అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. రెండో విడత ఓదార్పు యాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం స్థానిక ఓదార్పు కార్యాలయంలో ఆయున విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
పెనుమత్స ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకూ జిల్లాలో చేపట్టనున్న ఈ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి 608 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఎనిమిది కుటుంబాలను ఓదారుస్తారని ఆయన తెలిపారు. ఈ ఓదార్పుయాత్రలో 70 వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు.