Post date: Aug 13, 2011 8:55:39 AM
‘‘ఈ రోజు కేంద్రంలో సోనియా గాంధీ కేంద్రంలో రాజ్యమేలుతోందంటే అది మా నాన్న వైస్ చలవే. ఆయన ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కేంద్రానికి రాష్ట్రం నుండి 35 మంది ఎంపీలను అందించారు. కానీ సోనియాగాంధీ అంతటి మహానేతను అప్రదిష్ట పాలు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపారు’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
ఇలాంటి వారు ఎంతమంది ఏకమైనా వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజల గుండె నుండి తొలగించలేరని జగన్ అన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో ఆయన గురువారం ఐదు వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. దారి పొడవునా ఆయనకు జనం స్వాగతం పలికారు. వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు రాజకీయ పార్టీలు నైతిక విలువలను పక్కనపెట్టి అనైతికంగా కలుస్తున్నాయి.దేవుడు అనేవాడు ఇదంతా చూస్తున్నాడు. న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది అని అన్నారు.