Post date: Aug 18, 2011 9:57:9 AM
కృ ష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన మూడవ రోజు ఓదార్పు యాత్ర అప్రతిహతంగా కొన సాగుతోంది. బుధవారం రాత్రి 9.30 ని.లకు నందిగామ చేరుకున్న ఓదార్పుయాత్రకు విశేష ప్రజాధరణ లభించింది. అశేష జనవాహిని మధ్య తడిసి ముద్దయ్యింది. నందిగామ ప్రజ జగన్కు జయ జయ ధ్వానాలతో స్వాగతం పలికారు. జగన్ ముందుగా మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరి గుండెల్లో పదిలంగా ఉన్నారని అన్నారు. రాజశేఖరరెడ్డి సువర్ణ యుగంలో ప్రతి ఒక్కరికీ భరోసా ఉండేదని జగన్ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే పరిస్థితే లేదని... వాటి వైపే చూసే నాధుడే లేడని జగన్ అన్నారు. ఆ మహానేత రాజశేఖరరెడ్డి కలలుగన్న సువర్ణ యుగాన్ని త్వరలో తిరిగి తప్పక చూస్తామని ఆయన అన్నారు.