Post date: Dec 21, 2011 9:40:9 AM
ప్రతీక్‌రెడ్డి మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కోమటిరెడ్డిని ఫోనులో పరామర్శించారు. ప్రతీక్‌రెడ్డి, మరో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, టి.కాంగ్రెస్ ఎంపీల తరఫున పొన్నం ప్రభాకర్, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, మంత్రి పార్థసారథి, మిర్యాలగూడ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లు తమ సందేశాల్లో సానుభూతిని వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరులు అనిల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులను హోం మంత్రి సబితారెడ్డి, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు బాలు నాయక్, ప్రతాప్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రాజేందర్, పిడమర్తి లింగయ్య, శ్రీశైలం గౌడ్లు పరామర్శించారు. ప్రతీక్ మరణంతో చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విషాదం అలముకుంది.