Post date: Aug 30, 2011 6:27:56 PM
కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న ఓదార్పుయాత్రకు బుధవారం మధ్యాహ్నం నుంచి తాత్కాలిక విరామం ప్రకటించారు. సెప్టెంబర్ 2 తేదిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు వెళ్లనున్నారు.
కృష్ణా జిల్లాలో రెండవ విడుత ఓదార్పుయాత్ర సెప్టెంబర్ 6 తేదిన తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే ఓదార్పుయాత్ర జరిగింది. 211 గ్రామాల్లో 679 కిలోమీటర్లు పర్యటించి 229 విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా ఓదార్పుయాత్రలో 22 కుటుంబాలను యువనేత పరామర్శించారు.