Post date: May 02, 2011 5:48:55 AM
దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమె ప్రచారానికి వెళ్లిన ప్రతి ఊరిలోనూ ఓటర్ల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఆమె వద్దకు వచ్చి ఆప్యాయతతో పలకరిస్తూ మా ఇంటికి రావాలంటే... మా ఇంటికి రావాలంటూ పట్టుబట్టి మరీ తీసుకెళుతున్నారు. పులివెందుల చర్చిలో ఆదివారం ప్రార్థనల అనంతరం విజయువ్ము పులివెందుల మండలం నల్లగొండువారిపల్లె, దళితవాడ, మల్లికార్జునపురం, లింగాల మండలం బోనాలబల్లెలలో ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఒక ఓటు తనకు, మరో ఓటు వై.ఎస్.జగన్‌కు వేయాలని కోరారు. వైఎస్ సోదరి విమలమ్మ, వదిన భారతి, వై.ఎస్.జయమ్మ, విమలమ్మ కుమార్తె దివ్య, వై.ఎస్.శ్వేత, ఇ.సి.గంగిరెడ్డి కోడలు ఇ.సి. వినీల వేముల మండలం చాగలేరు, అమ్మయ్యగారిపల్లె, గొందిపల్లె, కొత్తపల్లె, పెండ్లూరు, పెర్నపాడు, నల్లచెరువుపల్లె, గొల్లలగూడూరు, పెద్దజూటూరు, కొండ్రెడ్డిపల్లె, ఎద్దులయేని, సిద్ధంరెడ్డిపల్లె గ్రామాల్లో నమూనా ఈవీఎంలలో గుర్తును ఓటర్లకు చూపిస్తూ విజయమ్మ, జగన్మోహన్రెడ్డిలకు కేటాయించిన ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
పులివెందుల పట్టణంలో గుంతబజార్లో వై.ఎస్.మనోహర్‌రెడ్డి కోడలు వై.ఎస్.శిల్పారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి కొండా సురేఖ వేంపల్లెలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పోలింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని పెంచేలా ముందుగానే ఓటర్లను సవూయుత్తం చేయాలన్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి, మాజీ మంత్రి మారెప్ప కుమారుడు శాంతి కిరణ్ పట్టణంలోని మారుతి థియేటర్ రోడ్డు, బండి శేషారెడ్డి స్కూలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.