Post date: Apr 28, 2011 5:13:37 AM
ప్రొద్దుటూరు (వైఎస్ఆర్ జిల్లా), న్యూస్‌లైన్:
వైద్యఆరోగ్య శాఖ మంత్రి, కడప పార్ల మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి తన ఆస్తులను ప్రజల కు పంచిపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రోడ్ షోలో భా గంగా ప్రొద్దూటూరు మండలం కొత్తపల్లె క్రాస్ రోడ్డు వద్ద ఆమె మాట్లాడారు. జగన్‌కు 2లక్షలకు పైగా మెజారిటీ వస్తే తన ఆస్తులను రాసిస్తానని ముందుగా డీఎల్ సవాల్ విసిరిన అంశాన్ని ఆమె ప్రస్తావించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజా స్పందన చూస్తే జగన్‌కు అంతకన్నాఎక్కువగానే మెజారిటీ వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఫలితాలు వెలువడిన వెంటనే డీఎల్ తన ఆస్తులను జగన్‌కు కాకుండా ప్రజలకు పంచిపెట్టాలని కోరారు. డీఎల్ అఫిడవిట్లో నమోదు చేసిన ఆస్తులు కాకుండా అక్ర మంగా సంపాదించిన ఇతర ఆస్తుల వివరాలు కూడా తమకు తెలుసునని చెప్పారు. వాటన్నిం టిని ప్రజలకు రాసిచ్చి, ఆయనకు చిప్ప చేతికిస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థ్థిని బిందు వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించిన తీరు పలువురిని ఆకట్టుకుంది.