పై మన తాళిబొట్టు..పుస్తి ని తయారు చేసినవారు శ్రీ సాదా.సుబ్బారావు,గోల్డుస్మిత్,చలపతి కాంప్లెక్స్,కొరడావీధి,చిన్నబజార్,నెల్లూరు. పుస్తిని తయారు చేయించుకోవాలనుకొనేవారు శ్రీ సుబ్బారావు ను ఫోన్.నెం.9100772916 కు కాల్ చేసి సంప్రదించగలరు. వీరు చాలకాలంగా పుస్టీ లు తయారు చేస్తున్నారు.
తాళి
తాళి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
ఉభ. దే. వి.
1. పతకము;
"వ. హృదయసదనుండగు మదనునకుఁ బొడము బీభత్సరసంబు రుచిరవక్షస్స్థలంబునం దోఁచిన విధంబున నీలంపుతాళి తళుకు సంఘటింప."చంద్ర.
2. హార విశేషము.
"మ. రఘురామస్వామి స్వగ్రీవఁ బా, యని వైడూర్యపుఁదాళిఁ గైకొని తదీయగ్రీవనుంచెన్ గృపన్," ఉ, రా. ౫, ఆ. (చూ. తాళీ.)
సం. ఈ. స్త్రీ.
శ్రీతాళము.
తాలి, తాళి, తాలిబొట్టు, తాళిబొట్టు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
tāḷi
[Tel.] n.
A small piece of gold which the bridegroom ties round the bride's neck as a sign of marriage. పుస్తె, మంగళసూత్రము.
తాళి, తాళీ : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
tāḷi
[Tel.] n.
A necklace. పతకము, ఒకవిధమైన హారము.
తాలి, తాళి : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 గ్రంథసంకేత వివరణ పట్టిక
వి.
మంగళసూత్రము.
తాళి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
same as తాలి.
తాళి : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
విశేష్యము
పతకము, హారము.
రూ. తాళీ.
మంగళసూత్రము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
ఐదువత్రాడు, కంటె, కంఠసూత్రము, తా(ళి)(లి), త్రాడు, పసుపుత్రాడు, పుస్తె, బొట్టుదారము.
మంగళసూత్రం : ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
సతుమానం, సూత్రం, మంగళసూత్రం [కళింగ మాండలికం]
పుస్తె, నాంతాడు [తెలంగాణ మాండలికం]
తాల్బొట్టు, తాళి [రాయలసీమ మాండలికం]
తాళి : వావిళ్ల నిఘంటువు 1949
ఉభ.దే.వి.
1. మంగళసూత్రము.
“ఆ. తాళిఁగట్టె నపుడె తలిరాకుఁ బోఁడికిఁ, బుడమిఱేఁడు వేడ్క గడలుకొనఁగ.” య. ౪,ఆ. ౧౦౬., నిరం. ౨,ఆ. ౧౨౮.;
2. హారవిశేషము.
“మ. …ఖ్యాతితో, మను మంచున్ హనుమంతుఁ బల్కి రఘురామస్వామి స్వగ్రీవఁ బా,యని వైదూర్యపుఁ దాళిఁ గైకొని తదీయ గ్రీవ నుంచెం గృపన్.” ఉ. రా. ౫,ఆ. ౩౦౫., అచ్చ. సుం. ౩౪.;
3. పతకము.
“వ. హృదయసదనుం డగు మదనునకుఁ బొడము బీభత్సరసంబు రుచిరవక్షస్స్థలంబునం దోఁచిన విధంబున నీలంపు తాళి తళుకు సంఘటింప…” చంద్రా. ౫,ఆ. ౧౨౪., ఆం. భా. ద్వి. ౧౪౯.
సం.వి.న్.పుం.
శివుఁడు.
ఇ.ఈ.స్త్రీ.
1. నేలయుసిరిక†.
2. శ్రీతాళము, పెద్దయాకులతాడి†.
ఈ.స్త్రీ.
1. నేలతాడి†;
2. కంది†;
3. తాళపుఁజెవి.
తాళి : పురుషోత్తమ కవీయము అను శబ్దరూపప్రబోధకనిఘంటుత్రితయము (నాదెళ్ల పురుషోత్తమ కవి) 1918
అన్యరూపదీపిక:
శబ్దము: తాళి
రూపాంతరము: తావడము, తావళము
టీకా: దండ
తాళి, (తాళీ) : ఆంధ్ర-సంస్కృత కోశము (పుల్లెల, కప్పగంతుల ఆం.ప్ర.సా.అ.) 1971
వి.
1. చూ. గొలుసు.1
2. చూ. ఉత్తరిగ.
తాళిబొట్టు
తాలి, తాళి, తాలిబొట్టు, తాళిబొట్టు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
tāḷi
[Tel.] n.
A small piece of gold which the bridegroom ties round the bride's neck as a sign of marriage. పుస్తె, మంగళసూత్రము.
మంగళసూత్రపు బొట్టు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
తాళిబొట్టు, పుస్తె, బొట్టు, మాంగల్యము, మినుకు.
తాళిబొట్టు : రావిశాఖీయం (అత్తలూరి నరసింహారావు) 1977
మంగళసూత్రం. [ఆరు చిత్రాలు 13]
తాళిబొట్టు : వావిళ్ల నిఘంటువు 1949
దే.వి. (తాళి + బొట్టు)
మంగళసూత్రమునఁ గట్టు స్వర్ణాభరణ విశేషము, పుస్తె.
“గీ. …తాళి,బొట్టు మూసికతోఁ గూర్చి పొసఁగ నఱుఁతఁ, ద్రాడుగట్టక సొగసెల్లఁ దఱిమి యొడల, వ్రేలు వలరాచబలు బూచి వీడఁ గలదె.” నీలా. ౧,ఆ. ౧౦౩., విప్ర. ౧,ఆ. ౪.
(ఇట్లే: తాళి పతకము. ప్రబంధ. ౨౭౩.)
పుస్తె
పుస్తె : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
దే. వి.
మంగళసూత్రము.
"తే. పుస్తెగట్టిన యదిమొదల్ పొంతరావు." రుక్మాం. ౪, ఆ.
పుస్తె : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
puste
[Tel.] n.
1. The mark of marriage, being a small gold disc worn round the neck by married women. తాళిబొట్టు. See మంగళసూత్రము,
2. Any charmed bead, though worn on the wrist.
పుస్తెబొందు the tali string.
పుస్తె : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
same as తాలి.
పుస్తె : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
విశేష్యము
తాళిబొట్టు.
మంగళసూత్రము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
ఐదువత్రాడు, కంటె, కంఠసూత్రము, తా(ళి)(లి), త్రాడు, పసుపుత్రాడు, పుస్తె, బొట్టుదారము.
మంగళసూత్రపు బొట్టు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
తాళిబొట్టు, పుస్తె, బొట్టు, మాంగల్యము, మినుకు.
పుస్తె : మాండలిక పదకోశం (తె.అ.) 1985
తాళిబొట్టు, మంగళసూత్రం [కళింగాంధ్రం; కోస్తా; తెలంగాణం; దక్షిణాంధ్రం]
మంగళసూత్రం : ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
సతుమానం, సూత్రం, మంగళసూత్రం [కళింగ మాండలికం]
పుస్తె, నాంతాడు [తెలంగాణ మాండలికం]
తాల్బొట్టు, తాళి [రాయలసీమ మాండలికం]
పుస్తె : వావిళ్ల నిఘంటువు 1949
దే.వి.
1. మంగళసూత్రము.
“గీ. …పుస్తె, యనఁగ మంగళసూత్రాఖ్య యలరుచుండు.” ఆం. భా. ద్వి. ౧౪౮.
“గీ. పుస్తె గట్టినయది మొద ల్పొంతరావు.” రుక్మాం. ౪,ఆ. ౪౨౮.
2. తాలిబొట్టు, మంగళసూత్రమందు గ్రుచ్చెడి స్వర్ణాభరణవిశేషము.
పుస్తె : ఆంధ్ర-సంస్కృత కోశము (పుల్లెల, కప్పగంతుల ఆం.ప్ర.సా.అ.) 1971
చూ. తాలి.
మంగళసూత్రము
మంగళసూత్రము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. అ. న.
బొట్టుదారము.
మంగళసూత్రము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
mangaḷa-sūtramu
n.
The cord or necklace with which the తాళిబొట్టు or token of marriage is fastened on the neck of the bride. బొట్టుదారము.
మంగళసూత్రము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
n.
the marriagestring, a string tied by the bridegroom round the neck of the bride and worn by her as long as the husband lives.
మంగళసూత్రము : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
సంస్కృత విశేష్యము
మాంగల్యము, పుస్తె.
మంగళసూత్రము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
ఐదువత్రాడు, కంటె, కంఠసూత్రము, తా(ళి)(లి), త్రాడు, పసుపుత్రాడు, పుస్తె, బొట్టుదారము.
మంగళసూత్రము : ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
[తెలుఁగు] తాలిబొట్టు, బొట్టితోడి దారము.
[తమిళము] తాలి, మాంగలియం.
[కన్నడము] గుళిదార, తాళి.
మంగళసూత్రము : వావిళ్ల నిఘంటువు 1949
సం.వి.అ.న.
1. బొట్టుదారము, వివాహములో వధువుమెడకుఁ గట్టు పుస్తెతోఁ గూడిన పసుపుదారము, తాలి.
జై. ౨,ఆ. ౯౦.
2. రక్షరేకునకుఁ గట్టిన దారము.
మాంగల్యము
మాంగల్యము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. అ. న.
1. మంగళత్వము;
2. తాలిబొట్టు.
మాంగల్యము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
māngalyamu
[Skt. from మంగళము.] n.
1. Auspiciousness, మంగళత్వము.
2. The marriage token, తాళిబొట్టు,
మాంగల్యధారణము tying the marriage knot, i.e. , performing the ceremony of attaching the Tali to the neck of the bride.
మాంగల్యము : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 గ్రంథసంకేత వివరణ పట్టిక
వి.
1. బంగారము.
2. వెలగ.
3. పెరుగు.
4. కొబ్బరికాయ.
5. జీవకము.
6. స్థలపద్మము.
7. మసూరకము.
8. మధూకము.
[1. శుభము, అభివృద్ధి. 2. క్షేమకరమగు వస్తువు-తాళి. 3. తాళిబొట్టు; విణ. శుభప్రదము అని సూ.ఆం.ని.]
మాంగల్యము, మాంగళ్యము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
n.
1. auspiciousness;
2. same as తాలి.
మాంగల్యము : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
సంస్కృత విశేష్యము
1. మంగళత్వము.
2. తాళిబొట్టు.
మంగళసూత్రపు బొట్టు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
తాళిబొట్టు, పుస్తె, బొట్టు, మాంగల్యము, మినుకు.
మాంగల్యము : ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
[తెలుఁగు] తాలిబొట్టు.
[తమిళము] మాంగలియమ్, తాలి.
[కన్నడము] గుళదాళి.
బొట్టుదారము
బొట్టుదారము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
ద్వ. వి.
బొట్టును గ్రుచ్చెడు మంగళసూత్రము.
బొట్టుదారము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
boṭṭu-dāramu
n.
The string round the neck from which the tāli is suspended, మంగళసూత్రము.
మంగళసూత్రము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
ఐదువత్రాడు, కంటె, కంఠసూత్రము, తా(ళి)(లి), త్రాడు, పసుపుత్రాడు, పుస్తె, బొట్టుదారము.
బొట్టుదారము : ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
[తెలుఁగు] బొట్టును గ్రుచ్చెడు మంగళసూత్రము.
[తమిళము] తిరుమాంగలియం కోర్కుం నూలిన్ సూత్తిరం.
[కన్నడము] గుళదాళియ దార.
బొట్టుదారము : వావిళ్ల నిఘంటువు 1949
ద్వ.వి.
బొట్టును గ్రుచ్చెడు మంగళసూత్రము. ( శ. ర.)