Purushottamulu: Sriman Malladi Satyalingam Naicker Garu

కాకినాడ MSN గారి చారిటీస్ నందు ఎంతోమంది తూర్పుగోదావరి పశ్చిమగోదావరి రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళు కులమత బేధాలు లేకుండా చదువుకునేందుకు విద్యా దాత సత్య లింగ నాయకర్ గారు సమకూర్చిన విద్యా దాత,ఆయన చేసినటువంటి దానగుణం ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరికి రానది. ఆ మహాదాత కి శతకోటి వందనాలు. 

********************************************

ప్రశ్న : మహాత్మా గాంధీజీ ఎవరికైన సాష్టాంగవందనం  చేసుకునుంటే, అట్టివారి పేరు ఒకరిది చెప్పండి.  

జవాబు : శ్రీమాన్ మల్లాడి సత్యలింగం నాయకర్ గారు. See this page 308, line 5

https://sites.google.com/view/agnivahnikukutpally/folder111/purushottamulu-sriman-malladi-satyalingam-naicker-garu 

********************************************

కీ.శే.లు మల్లాడి సత్యలింగం నాయకరు

   ఈ ధర్మదాత దివ్యచరిత్ర వారి కడపటి మరణ శాసనమే దేశమునకు చాటుచున్న యది. మల్లాడి సత్యలింగం నాయకరు గారు కాకినాడ పట్టణమున స్ధాయిగలుగ జేసికొనిన యగ్నికులక్షత్రియుడు. రఘకుల గోత్రజుడు. స్వార్జితముగ తన జీవితకాలములో నిరువది లక్షల రూప్యములకుపైన యాస్ధిని సంపాదింపగలిగిన యుక్తి నైపుణ్యుడు. అదృష్టజాతకుడు. వీరు బాల్యమున కడు పేదరికము ననుభవించుచు స్వగ్రామము ననున్న నేమియు ప్రయోజనము లేదని భావించి రంగూనునకు బోయి కృషి సలుపనెంచి యొక తెలుగు యోడలో నచ్చటకు బయలుదేరిరి. నావికులలో నితడె జిన్నపిల్లవాడుగ నుండెను. నతనికి ప్రధమ నౌకాయానముగూడ నిదియే. ఆదినములలో కొత్తవారెవరయిన నోడలోనుండి సబురు చేయుచుండి నాయోడకు గాలి యెదురైన గాని, లేక గాలి లేకగాని, నడక సాగని యెడల యీక్రొత్త యాత్రీకుని నోడకొయ్యకు గట్టు మోటువాడుక గలదు. ఈ బాలుడు సత్యలింగం తన ప్రధమ నౌకాయాత్రలో నట్టి యకృత్యమున కెరగావలసివచ్చెను. ఈ మహనీయుని భావి నిసుమంతము నెఱుంగని యామొరటు నావికులు గాలి పడిపోయినదని యాబాలుని చేతులు యోడకొయ్యకువైచి గట్టిరి. గొప్ప పురుషుల జీవితములందు వారి బాల్య దశ యిట్టి యిడుములకు లోనై యుండుట యొక వింతగాదు. "కష్టేఫలి" యను నార్యోక్తి వినుటలేదా తుదకెటులనో నీ సత్యలింగంగారు రంగూను యొడ్డున జేరిరి. ప్రారంభమున కాయకష్ట ముచే తనజీవయాత్ర గడప వలసి వచ్చెను. యెన్ని కష్టముల ననుభవించినను, జగదాధారభూతుడగు నాభగవన్నామము మరచెడివారుకారు. తన జీవితమునకు మార్గదర్శకుడా యీశుడేయని గురిపెట్టి యుండెను. ఇట్లు కష్టపడి పని చేయుచు ధనము సేకరించి, దుర్వ్యయములు లేక ఘనత వహించెను. వీరి ధర్మ గుణమును వీరి మరణ శాసనమె ప్రపంచమునకు చాటుచున్నయది. వీరికి సంతానము లేదు. సుబ్రహ్మణ్యమను నొక బాలుని దత్తత చేసికొనెను. వీరు మరణించు సరికి దత్తత కుమారుడు పాతికేండ్ల ప్రాయముగలిగి యుండెను. అప్పటికి తనకుంగల 20 లక్షల రూప్యములలో 8 లక్షలు దాన ధర్మము లకును మిగతా పండ్రెండు లక్షలు తన దత్త కుమారునికిచ్చి స్వర్గలోక సౌఖ్యమునను భవించుటకై జనెను.

     సత్యలింగంనాయకరుగారు 29-09-1912 తేదీన పుట్టబడిన తన కడపటి మరణ శాసనములో 8,00,000 రూప్యముల ధర్మము నీరీతి వివరించిరి.  ఇందు 1,00,000 రూపాయలు నీ దిగువ కట్టడములకు, వాటి నిమిత్తము సంపాదింపబడు స్థలములకు వెచ్చింప వలెను.

    1. విశాలమగు నాటస్థలములతో నవీన యేర్పాటులు గల జమ్నీషియములతో మద్రాసు యిలాకా కాకినాడ జగన్నాధపురములో నిటుకలతో నొక్క స్కూలు కట్టుట.

  2 కాకినాడ సమీపమునంగల చొల్లంగి గ్రామములో దేవస్థానమొకటి తగిన వసతులతో శాశ్వతముగ నుండునటుల నిర్మించుట. 

      3. బీదలకన్నమిడుటకు స్కూలుకు సమీపమున జగన్నాధ పురములో నొక సత్రము కట్టుట.

   పై కట్టడములకగు సొమ్ముగాక మిగతా 7,00,000 నుండి వచ్చు వడ్డీవల్లను పైధర్మములు పోషింప బడవలెను. మదరాసు యూనివర్సిటీ ననుసరించి ప్రైమరీ తరగతి వరకు బాలబాలికలకు విద్య గరపుటకై స్కూలు నేర్పాటు చేయవలెను. జాతి మత భేదములు లేక నన్నిజాతుల వారికి స్కూలు వినియోగపడ వలెను. వడ్రం, నేత , కుండలు చేయుట మొదలగు చేతి పనులు నేర్పు క్లాసులు స్కూలుకు జేర్పవలెను.  విద్య యెల్లరకు  నుచితముగనే నేర్పవలెను. చొల్లంగిలో నేర్పరపబడు దేవాలయములో దినమునకు రెండు మార్లు పూజ జరుపగ వలెను. కావలసినంత మంది నౌకర్లు , నర్చకులు, గాయకులు దేవాలయమున కుండవలెను. జాతి వివక్షత లేకనె సమముగ నొకేసారి 200 జనము భోజనము చేయుటకు తగిన వసతిగల సత్రమును కట్టవలెను. భోజనమునకు జనము దొరికిన యెడల అధమము నూరుమందికి తక్కువగాని జనమునకు రోజుకొక పర్యాయముల భోజనమిడ వలెను. సదరు నూర్గురలో 25 గురు బీద స్కూలు పిల్లలుండ వచ్చును. నిత్యము కొందరు బ్రాహ్మణులకు గూడ నన్నము బెట్టవలెను. ఇందుకు బ్రాహ్మణులే వంటవారలుగ నుండవలెను. కాయగూరలే గాని యితరకూర లా సత్రములో నుపయోగింపరాదు. అదిగాక నొక పండ్రెండుగురు బ్రాహ్మణులకు రోజున కొక్కంటికి నధమము రెండు గంటల కాలము వేద పఠనముగావించిన యెడల నచ్చటన్నము బెట్టవచ్చును.

  పైధర్మములుగాక నీధర్మకర్తలొక మదరాసు హిందువును యున్నత విద్యకొరకు గాని, పారిశ్రామిక విద్య కొరకు గాని, యూరప్, అమెరికా, జపాన్ లేక మఱి యేయితర దేశమునకైనను ప్రతి సంవత్సరము పంపు చుండవలెను. అట్టి విద్యార్ధివల్ల లా యున్నూ, సాధారణ వైద్యముగాక మఱియొక విద్య నేర్చుకోవచ్చును. సయిన్సు , కెమిస్ట్రి , ఫిజిక్సు మొదలగు విషయములు కోరు విద్యార్ధి గ్రాడ్యుయేటుగా నుండవలెను. ఇందులకై ప్రతి వత్సరము 4000 రూప్యముల నుపయోగింపవలెను. ఒక విద్యార్ధి కొరకు నింత సొమ్ము ఖర్చు కానియెడల తగినంత మందిని బంపి  సదరు సొమ్మును ఖర్చు పర్పించవచ్చును.  సదరు విద్యార్ధులు మంచి నడతను గలవారై యుండవలెను. ఇట్టి ఘనకార్యముల నిర్వర్తించుటకు యుక్త వయస్సుననున్న తన కుమారుడు సుబ్రహ్మణ్యం నాయకరుగారిని, చాలా కాలము నుండి తనవద్దనే యుండి తన వ్యవహారముల నతి జాగరూకతతో జూచుచున్న తన కులజుడగు పినపోతు గోవిందరాజుగారిని, మరి యిరువురు కాకినాడలోని పెద్ద మనుష్యులను నియమించిరి. ఈనల్గురిలో సరిసమాన భేదాభిప్రాయము గల్గియున్నతరియందొకనికి యదనపుటోటు యుండునటుల గూడ నేర్పరచి యుండిరి.

        ఇట్టి మహాదాత యీకులమున వెలసి యట్టి వితరణ మీప్రపంచమున వెదజల్లి యుండగ శని మహాత్మ్యమో శాప్యప్రభావమో ? మన మాంద్యమో లేక దుర్బలత్వమో ? గాక యన్యుల నేర్పరి తనమో జెప్పజాలము గాని యింతవరకీ కులజులట్టి దాన ఫలితమును బొంద కుండుట కడు శోచనీయము. "కాలమొక్క రీతి నుండదుగాదె జగతి" యను నార్యోక్తి ననుసరించి సమస్తము సర్వకాలమొకేరీతి జరుగగలదా యను యాశమాత్రము నశించుట లేదు.

   వీరి తనయులగు సుబ్రహ్మణ్యం నాయకరుగారు కులాభిమానము విడనాడక తన సహోదరులకొకింత సాయమొనర్చుట తన కర్తవ్యమని యెఱింగిన వారలై యాంధ్రదేశమున మన రెండవ మహాజన సభ నతి వైభవముతో, తన స్వంత ఖర్చులతో , కాకినాడ పట్టణమున గావించిరి. కొంత మంది బీదయగ్నికుల బాలురకుచిత భోజనాది సౌకర్యముల నేర్పరచి విద్య నేర్పించిరి. దైవవిధిచే బాల్యప్రాయముననే పరలోక ప్రాప్తినొందవలసి వచ్చిన వారలై తన కులజుల విద్యాభివృద్ధి కొరకై కొంత ధనమొసంగు నటుల యొక దానశాసన మేర్పరచి గతించిరి.