Myla Nagayya Varma gaaru
తమిళనాడు శాసనసభ ( 2021 - 2026 ) కు ఎన్నికైన మన వన్నియకులక్షత్రియ MLA లు.. తమిళనాడు లోని మొత్తం 234 MLA స్థానాలకు మన వన్నియకులక్షత్రియులు మొత్తం 36 మంది ఎన్నికయ్యారు. వీరిలో DMK పార్టీ అభ్యర్థులుగా 21 మంది, AIADMK -8, PMK -5, INC-1, VCK-1 పార్టీ అభ్యర్థులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుత తమిళనాడు రాష్ట్రప్రభుత్వం లో మన వన్నియకులక్షత్రియ మంత్రివర్యులు ముగ్గురు సేవలందిస్తున్నారు... వీరు : శ్రీ దురై మురుగన్ ( నీటిపారుదల, మైనింగ్ శాఖ మంత్రి ), శ్రీ SN.శివశంకర్ ( రవాణా శాఖ ), శ్రీ పన్నీర్ సెల్వం (వ్యవసాయ శాఖ). 🪷🙏🪷 శివశంకర్. తిరువత్తూరు
***********************************************************************************************************************
కీ. శే. కడువెట్టి. గురు ( 1-2-1961 -- 25-5-2018). వీరు తమిళనాడు, అరియలూరు జిల్లా, ఉడయార్ పాలెం తాలూకా, జయకొండం పంచాయతి, కడువెట్టి గ్రామంలో జన్మించారు. తమిళనాడు వన్నియర్ ( వన్నియకులక్షత్రియ ) సంఘ అధ్యక్షులుగా, ఆండిమడం MLA (2001-2006), జయకొండం MLA(2011-2016) గా విశేష సేవలు అందించారు.
పీఎంకే పార్టీ అభ్యర్దిగా రెండుసార్లు...2001 & 2011 లో తమిళనాడు శాసనసభ్యులుగా ఎన్నికై మంచి ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందారు.. వీరు 1980 లో వన్నియార్ లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని నిర్వహించిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వన్నియర్ ఫైర్ బ్రాండ్ గా మరియు మహావీరన్ గుర్తింపు పొందారు. Mahabalipuram Vanniyar Sangam Meeting Kaduvetti Guru Full Speech Part 2 https://youtu.be/U2STYGVlKe0
కీ. శే. 🔥 కె.వినాయకం రెడ్డియార్ గారు 1957 & 1967 లో టి నగర్ & తిరుత్తణి ల నుంచి MLA గా ఎన్నికై ప్రజాసేవచేశారు. వీరు స్వాతంత్ర సమరయోధులు. తిరుత్తణి ని మద్రాసు రాష్ట్రంలో కలపాలని ఉద్యమం నిర్వహించారు. వీరు శ్రీమతి సౌమ్య అన్బుమణి ( W/o డా. అన్బుమణి రాందాస్ ) గారికి తాత గారు. వీరు మన వన్నియకులక్షత్రియులు.
యానం మాజీ శాసనసభ్యులు రక్షా హరికృష్ణ గారి 84వ జయంతిని పుర స్మరించుకొని మెట్టకురులో రక్షా హరి కృష్ణ గారి విగ్రహానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు పూలమాలలు వేసి జయంతిని పురస్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంలో భాగంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు మాట్లాడుతూ రక్ష హరికృష్ణ గారు యానం ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తమ ఉద్యోగాన్ని వదులుకొని యానం ప్రజలకు సేవ చేయాలని సంకల్పం తో రాజకీయ రంగ ప్రవేశాన్ని చేసి 1990లో మొద టిసారిగా శాసనసభ్యునిగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు.
రాష్ట్రము అంత మన వారు వున్నా మనకి సముచిత స్తానం లేకపోవటానికి ప్రధాన కారణం మన వాళ్ళు చాల మందికి మన కులం మీద సరైన అవగాహనా లేక పల్లీలని కొందరు, పల్లెకారులు అని కొందరు, మారకాళ్లు, మత్యకారులు అని కొందరు చెప్పుకుంటూ అదే పేరుతో క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవటం వలన దాదాపు ముప్పై లక్షల పైన ఉన్న మన వారిని గవర్నమెంట్ లెక్కల్లో 12 లక్షలుగా మాత్రమే చూపిస్తున్నారు.
నేడు ప్రతి రాష్ట్రము లో కుల గణన లో భాగంగా మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నవంబర్ 15 నుండి కులగణన జరుగుతుంది కావున ప్రతి ఒక్క అగ్నికులక్షత్రియుడు భాద్యతగా తీసుకుని మన వారు అందరు తప్పని సరిగా మన కులం పేరు "అగ్నికులక్షత్రియ" అని మాత్రమే చెప్పే విధంగా మీ ఇంట్లో వారిని, మీ ప్రాంతం లో వారిని, మీ గ్రామం లో వారిని చైతన్యం చేయవలసినదిగా కోరుతున్నాము.