హొయసాల రాజ్యం ( కర్ణాటక లోని ద్వారసముద్రం ప్రాంతం నుంచి తమిళనాడు లోని తిరుచునాపల్లి /తిరువన్నా మలై వరకు ) మహారాజు గా కీ. శే. వల్లాల మహారాజు సింహాసనాన్ని అధిష్టించిన రోజు (1-2-1292) 🪷🙏🪷. వీరు 1292 -1342 సంవత్సర కాలంలో జనరంజికంగా పై రాజ్యపాలన చేశారు. వీరు మన వన్నియ / అగ్నికులక్షత్రియులు. వీరు శివభక్తులు. తిరువన్నామలై లోని దేవస్థాన ప్రధాన గోపురం నిర్మించారు. వీరికి సంతానం లేదు. వల్లాల మహారాజు మధురై లో ముస్లిం సైన్యాన్ని ఓడించారు. సంధి జరిగింది. అయితే అర్ధరాత్రి సమయంలో వీరు హత్యచేయబడ్డారు.వీరి మరణించిన సందర్బంలో వీరి అంత్యక్రియలు సాక్షాత్తు మహాశివుడే వచ్చి చేశారని స్థానికులు, దేవస్థాన అర్చకులు చెబుతారు. ప్రతి ఏడాది వీరి మరణతిధినాడు తిరువన్నామలై సమీప గ్రామమైన సమంతనూర్ లో స్థానిక వన్నియ కుల క్షత్రియులు వీరికి సాంప్రదాయ క్రతువులు, పూజలు నిర్వహిస్తారు. అదే సందర్బంగా తిరువన్నామలై లోని అన్నామలై దేవస్థానంలో విశేష పూజలు నిర్వహిస్తారు. తిరువన్నామలై దేవస్థానం కు వెళ్లే మనవారు, పై దేవస్థాన ప్రధాన గోపురం ఎదుట ఉన్న వీరి శిలా విగ్రహాన్ని సందర్శించ గలరు 🙏🙏 - తిరువత్తూరు. శివశంకర్
శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈ లిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది. ..... https://www.wikiwand.com/te/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF
పల్లవ మహారాజు, మహమల్లుడు కీ. శే. నరసింహవర్మ జయంతి నేడు. వీరు మహాబలిపురం లో ఐదు రాతిరధాలు, రాతిని మందిరాన్ని నిర్మించారు. చాలుక్య రాజు పలకేసిని యుద్ధంలో ఓడించి, సంహారించారు. 630CE - 668 CE కాలంలో పరిపాలన చేశారు.